చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష

1099చూసినవారు
చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష
పిఠాపురం పట్టణంలో జరిగిన ఇళ్ల చోరీ కేసుల్లో నిందితుడు ఎద్దు నరేంద్రసాయికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2020లో సీతయ్యగారితోట, మల్యాలవారి వీధి, వేణుగోపాలస్వామి గుడి వీధి ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లలో బంగారం, వెండి, నగదు చోరీ చేసిన మూడు కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ప్రతి కేసుకు ఏడాది చొప్పున శిక్ష విధిస్తూ పిఠాపురం ప్రిన్సిపల్ జేఎఫ్‌సీఎం ఎం. విజయరామేశ్వరీ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ జగదీష్ వాదనలు వినిపించారు. కేసు విచారణలో సహకరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

ట్యాగ్స్ :