మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదల సందర్భంగా గొల్లప్రోలు గోవింద మహల్ థియేటర్ వద్ద అభిమానులు బుధవారం రాత్రి సందడి చేశారు. ప్రీమియర్ షోకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు 'జై
జనసేన, జై పవన్ కళ్యాణ్' నినాదాలు చేశారు. తీన్మార్ డప్పులు, బాణసంచా కాల్పులు, నృత్యాలతో సంబరాలు జరుపుకున్నారు. సినిమా విడుదల వేడుక పండుగ వాతావరణాన్ని తలపించింది.