గొల్లప్రోలులో జనగణన వేగవంతం చేయాలి

6చూసినవారు
గొల్లప్రోలులో జనగణన వేగవంతం చేయాలి
గొల్లప్రోలు మండలంలో జనగణన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో సలాట్ రాజు అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులతో సమీక్షించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్ల వివరాలను కూడా సేకరించాలని సూచించారు. గ్రామాల్లో స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి నిరుద్యోగుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పాడా పీడీ శివరామప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్