సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆర్థిక భరోసా: మాజీ ఎమ్మెల్యే వర్మ

7చూసినవారు
సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆర్థిక భరోసా: మాజీ ఎమ్మెల్యే వర్మ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య, అత్యవసర అవసరాల్లో ఈ నిధి అండగా నిలుస్తోందన్నారు. బుధవారం పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రూ. 2 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులెవ్వరూ న్యాయం కోల్పోరని వర్మ స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్