ఆఫీసుకు రాకుండానే ఫిర్యాదు.. ఆన్‌లైన్‌లో అర్జీకి అవకాశం

7చూసినవారు
ఆఫీసుకు రాకుండానే ఫిర్యాదు.. ఆన్‌లైన్‌లో అర్జీకి అవకాశం
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపాలిటీలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాడా డైరెక్టర్ శివరామ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. కార్యాలయాలకు నేరుగా హాజరు కాలేని వారు ఆన్‌లైన్ ద్వారా కూడా అర్జీలు సమర్పించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ట్యాగ్స్ :