ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంకి చెందిన దివ్యాంగులు మేడిశెట్టి నాగమణి, అడ్డాల ప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2016, 92 చట్టాలను అమలు చేయాలని వారు కోరారు. దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి, అమలు దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, మేడిశెట్టి నాగమణికి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.