గోదావరిలోకి మురుగు నీరు చేరొద్దు: పవన్ కల్యాణ్

7చూసినవారు
గోదావరిలోకి మురుగు నీరు చేరొద్దు: పవన్ కల్యాణ్
పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఆరు జిల్లాల పరిధిలోని 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని, గోదావరి నదిలో కాలుష్య కారక వ్యర్థాల విడుదలను నిలువరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణ, పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్