ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి డ్రైవర్ మృతి

2600చూసినవారు
ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి డ్రైవర్ మృతి
గొల్లప్రోలు మండలంలోని ఎ. కె. మల్లవరం వద్ద ఏప్రిల్ 17న జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న డ్రైవర్ చిల్లా వెంకటరమణ (45) గురువారం మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చిన ఆయన, పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. మృతుని బంధువు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పరిస్థితులపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్