పిఠాపురంలోని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో చదివి, 2025 మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన 12 మంది అభ్యర్థులు ఆ గ్రంథాలయానికి రూ. 15 వేల విలువైన 20 కుర్చీలను విరాళంగా అందించారు. తాము విద్యను అభ్యసించిన సంస్థకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు. గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకరరావు ఈ అభినందనీయమైన చర్యను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సభ్యులు, ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.