రైతు సేవ కేంద్ర సిబ్బందికి ఎరువుల పంపిణీ యాప్ శిక్షణ

10చూసినవారు
రైతు సేవ కేంద్ర సిబ్బందికి ఎరువుల పంపిణీ యాప్ శిక్షణ
ఖరీఫ్ సీజన్‌కు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, పిఠాపురం రైతు సేవ కేంద్రంలో మంగళవారం ఎరువుల పంపిణీ యాప్‌పై శిక్షణ కార్యక్రమం జరిగింది. సహాయ వ్యవసాయ సంచాలకులు పి. స్వాతి, యూరియా, డీఏపీ పంపిణీ కార్డుల జారీ విధానం, యాప్ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె. వి. వి. సత్యనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్