పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసిన రెల్లి కులస్తులు

7చూసినవారు
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసిన రెల్లి కులస్తులు
పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను బుధవారం పిఠాపురం, గొల్లప్రోలు రెల్లి కమ్యూనిటీ పెద్దలు కాకినాడలోని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రెల్లి కమ్యూనిటీకి ప్రత్యేక గౌరవం ఉందని, పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమని అన్నారు. ఇటీవల విడుదలైన 40 పారిశుద్ధ్య ఉద్యోగాల్లో స్థానిక రెల్లి అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రిగారితో ఫోన్‌లో మాట్లాడినట్లు, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి స్థానికులకు ఎక్కువ అవకాశాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్