గొల్లప్రోలు
టీడీపీ కార్యాలయంలో జరిగిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే,
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ తనయుడు గిరీష్ వర్మ పాల్గొన్నారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని గిరీష్ వర్మ తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని,
టీడీపీ క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ అని ఆయన పేర్కొన్నారు.