గొల్లప్రోలు: వ్యాక్సినేషన్ మిస్ అవ్వకండి

17చూసినవారు
గొల్లప్రోలు: వ్యాక్సినేషన్ మిస్ అవ్వకండి
గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేటలో బుధవారం గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. వైద్య పర్యవేక్షకుడు బాషా మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని, గర్భిణులు సమయానికి పరీక్షలు చేయించుకోవడంతో పాటు టీకాలు తీసుకోవాలని సూచించారు. శిశువులకు తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, అదనంగా పౌష్టికాహారం, పరిశుభ్రత పాటించడం ద్వారా తల్లిబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్