కార్తీక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ, శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గొల్లప్రోలు శివాలయంలో బుధవారం సాయంత్రం జ్వాలా తోరణం నిర్వహించారు.