మాటిస్తున్నా.. ఉప్పాడలో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తా: పవన్

8చూసినవారు
మాటిస్తున్నా.. ఉప్పాడలో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తా: పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో మత్స్యకార ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ ప్రాంతానికి చెందిన 7 వేలకు పైగా కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి ఉన్నాయని, వేట నిషేధ సమయంలో వారికి ఏటా రూ.20 వేలు అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14న సీ ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణంపై సమావేశం నిర్వహించి, వాల్‌ నిర్మిస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్