యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో నిర్మిస్తున్న ఐఐఎస్టీకి కేంద్ర ప్రభుత్వం రూ. 28.43 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసిందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం రూ. 229.81 కోట్ల వ్యయంలో కేంద్ర, రాష్ట్రాలు సగం చొప్పున భరించాల్సి ఉందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ నిధులతో సంస్థ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తికానున్నాయని పేర్కొన్నారు.