పిఠాపురం పట్టణంలోని 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టు కాంప్లెక్సులో మార్చి 14వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీహరి తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ లోక్అదాలత్‌లో భాగంగా మూడు బెంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విచారణలో ఉన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని కక్షిదారులకు కల్పిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.