కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు బాధ్యతతో వ్యవహరించి, వేడుకలను ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని పిఠాపురం సిఐ శ్రీనివాస్ సూచించారు. రోడ్లపై గుంపులుగా చేరడం, కేక్ కటింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబంతో కలిసి ఆనందంగా, హాయిగా వేడుకలు జరుపుకోవడమే ఉత్తమ మార్గమని తెలిపారు.