పిఠాపురం నియోజకవర్గ
టీడీపీ మహిళా నాయకురాలు శ్రీవత్సవాయి లక్ష్మీదేవి గురువారం చిత్రాడలో జరిగిన మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు నిరుపేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. పేదల సంక్షేమం, మహిళల అభ్యున్నతి కోసం
ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా
లోకేశ్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు.