పవన్ కళ్యాణ్ దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేయాలి

4చూసినవారు
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఎలక్ట్రికల్ రివైండింగ్ ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ నెలవారి సమావేశం గురువారం అధ్యక్షులు వియ్యపు రమణ రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన భవన నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డులను కార్మికులకు అందజేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు క్లైమ్ లు ఇవ్వకపోవడం దారుణమని, ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యక్షులు సురవరపు గణేష్ భవన నిర్మాణ వెల్ఫేర్ కార్డులు రెన్యూవల్ చేసుకోవాలని కార్మికులను కోరారు.

సంబంధిత పోస్ట్