పిఠాపురం పట్టణంలోని స్థానిక పాడా కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని పీడీ చైత్రవర్షిణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు వారాలుగా దీపావళి, తుఫాను కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరించబడతాయని, కావున ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.