గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, ఏలేరు, పీబీసీ ప్రాంతాలలో వాటర్ లెవెల్ గేజ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పిఠాపురంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, రిజర్వాయర్ల నుంచి దిగువకు విడుదలయ్యే వరద నీటితో పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురికాకుండా నివారించడానికి రెగ్యులేటర్లు, కళింగల్స్, స్లూయిస్ల వద్ద ఈ గేజ్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.