గోవాలో మే 24 నుంచి 27 వరకు జరిగిన ఫస్ట్ ఆల్
ఇండియా ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో పిఠాపురం క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇండియన్ రౌండ్ విభాగంలో కె. సంపత్ జై, సీహెచ్ అశ్విన్, సీహెచ్ హనీత్ రతన్ లు కాంస్య పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణమయ్యారు. కోచ్ పి. లక్ష్మణరావు, అసిస్టెంట్ కోచ్ పి. కృష్ణ పర్యవేక్షణలో ఈ విజయం సాధించిన యువ క్రీడాకారులను స్థానిక క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.