కొత్తపల్లి మండలంలో వార్షిక మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొత్తపల్లి విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో పనులు జరుగుతాయని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ అంతరాయం కొండెవరం, కొత్త ఇసుకపల్లి, పాత ఇసుకపల్లి, నవఖండ్రవాడ, జొన్నలగరువు గ్రామాల్లో ప్రభావం చూపనుంది. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారుల సహకారాన్ని కోరారు.