గొల్లప్రోలులోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శాఖలో ఏర్పాటు చేసిన 25 అడుగుల మహాదివ్య శివలింగాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ సోమవారం రాత్రి దర్శించుకున్నారు. నవంబర్ 10వ తేదీ వరకు సహస్రలింగ దర్శనం, ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని బ్రహ్మకుమారీల కాకినాడ జోన్ ఇన్ఛార్జి రజనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శివ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.