గొల్లప్రోలులో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుమారు 500 మంది కళాకారులతో నిర్వహించిన ప్రదర్శనలు పట్టణ పురవీధుల్లో సందడి చేశాయి. ఉరుములు, తప్పెటగుళ్లు, కోలాటం, పులివేషాలు, లంబాడీ నృత్యాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంతటి భారీ స్థాయిలో జానపద కళారూపాలతో వేడుకలు నిర్వహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.