పాదగయలో రీజినల్ డీడీ క్రాంతి కుమారి ప్రత్యేక పూజలు

10చూసినవారు
పాదగయలో రీజినల్ డీడీ క్రాంతి కుమారి ప్రత్యేక పూజలు
ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఆడిట్ డిపార్టుమెంట్ రీజినల్ డీడీ క్రాంతి కుమారి పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఆమెకు స్వాగతం పలికారు. అర్చకులు క్షేత్ర విశిష్టతను వివరించగా, క్రాంతి కుమారి కుక్కుటేశ్వర్వస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, పదోశక్తి పీఠం పురు హుతిక అమ్మవారు, దత్తాత్రేయస్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వీరభద్ర రావు తదితరులు పాల్గొన్నారు.