మంగళవారం, గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు మీడియాకు తెలియజేసిన ప్రకారం, పట్టణ శివారు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు, జేసీబీ సహాయంతో మెయిన్ రోడ్డు, రాయవరం రోడ్డు, తాటిపర్తి పుంత రోడ్లలో ఈ పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు.