పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఎస్ఐ మణికుమార్ అవగాహన కల్పించారు. ఫోన్ చేసి పాస్వర్డ్, ఓటీపీ అడిగితే తెలియచేయరాదని, మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని, మహిళల రక్షణకు శక్తి యాప్ ఉపయోగించాలని సూచించారు.