పిఠాపురంలో ప్రాథమిక విద్యా ప్రమాణాల మెరుగుదలకు విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 244 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నట్లు ఎంఈవో నగీన్ తెలిపారు. అభ్యసన
ఫలితాలు మెరుగుపడి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని, ప్రభుత్వం విద్యా నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.