సంక్రాంతి పండుగకు ముందే రైతులకు నూతన పాస్‌పుస్తకాలు అందించడం ఆనందకరమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, బీజేపీ ఇన్ఛార్జ్ గండి కొండలరావుతో కలిసి రైతులకు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల రైతులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.