దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును తక్షణమే పదవి నుంచి తొలగించాలని దళిత సంఘాల నాయకులు గురువారం డిమాండ్ చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ, ఆకీవీడులో సంఘటన రోజురోజుకు వివాదస్పదం అవుతోందని, అక్రమంగా అరెస్టు చేసిన 50 మంది దళితులను వెంటనే విడుదల చేయాలని కోరారు. హోంశాఖ మంత్రి అనిత కూడా ఈ వివాదంపై స్పందించకపోవడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాకా రామకృష్ణ, ఖండవల్లి సుబ్బారావు, రాజాల నాగేశ్వరరావు, ఖండవల్లి మారేష్ పాల్గొన్నారు.