పిఠాపురంలో రైతు బజార్‌ను తక్షణమే వినియోగానికి తీసుకురావాలి

2చూసినవారు
పిఠాపురంలో రైతు బజార్‌ను తక్షణమే వినియోగానికి తీసుకురావాలి
పిఠాపురం పట్టణంలోని రాజావారి కోటలో నిర్మించిన రైతు బజార్‌ను వెంటనే ప్రజలు, రైతుల వినియోగానికి తీసుకురావాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. 2011లో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మించి 2015లో ప్రారంభించిన ఈ బజార్ గత 13 ఏళ్లుగా మూతపడి ఉందని, కొందరి కోర్టు వ్యవహారాలు, ఆక్రమణల వల్ల రైతులు సరుకులు అమ్మేందుకు కాకినాడ, తుని వెళ్లాల్సి వస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే నిరాహార దీక్షతో పాటు న్యాయపోరాటం చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్