గురువారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఉప్పాడ సెంటర్‌లోని బంగారమ్మ రావిచెట్టు వద్ద
ఎన్టీఆర్ విగ్రహానికి జనవిజ్ఞాన వేదిక, మద్యం మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. జిల్లా నాయకుడు వేమగిరి తలుపులయ్య మాట్లాడుతూ, మహిళల గౌరవాన్ని కాపాడిన మహానేత
ఎన్టీఆర్ అని, మద్యనిషేధం అమలు చేసి కుటుంబాల్లో ఆనందం నింపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్. సూర్యనారాయణ, వరద వీరభద్రరావు, మిరియాల చంటిబాబు, యేలేటి నానిబాబు తదితరులు పాల్గొన్నారు.