గొల్లప్రోలులో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

5చూసినవారు
గొల్లప్రోలులో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
గొల్లప్రోలు భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు తుమ్మలబాబు, ఓదూరి కిషోర్ హాజరయ్యారు. చేయూత సంస్థ రూ. 50వేల విలువైన స్పీచ్ థెరపీ మిషన్లను భవిత కేంద్రానికి అందించింది. విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేయాలని తుమ్మల బాబు, ఓదూరి కిషోర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శివ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్