రప్పా రప్పా 2. 0 ఫ్లెక్సీ వివాదంతో ఇద్దరిపై బైండోవర్ కేసు

15చూసినవారు
రప్పా రప్పా 2. 0 ఫ్లెక్సీ వివాదంతో ఇద్దరిపై బైండోవర్ కేసు
వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో ఏర్పాటు చేసిన ‘రప్పా రప్పా 2. 0’ ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఫ్లెక్సీని తొలగించారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన రాజా, దావీదులపై బైండోవర్ కేసు నమోదు చేసి, శుక్రవారం తహసీల్దార్ సూర్యప్రభ ఎదుట హాజరుపరిచారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై లక్ష్మీకాంతం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్