దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని జాతీయ రహదారి సమీపంలో గురువారం ఒక గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. ఉపాధి హామీ శ్రామికులు ఆ ప్రాంతంలో పనులు చేస్తుండగా తీవ్రమైన దుర్వాసన రావడంతో గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, ఆ వ్యక్తి మృతి చెంది సుమారు పది రోజులు కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నారు.