ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు, తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అన్నవరం ఆలయ పవిత్ర వాతావరణం తన మనసును ఎంతగానో ఆకట్టుకుందని గరికపాటి తెలిపారు.