తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం మండలం గౌరీపట్నంలో మంగళవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోరి వికాసం వేసవి సెలవుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కిశోరి బాలికలకు ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణ నైపుణ్యాలు, మంచి పనులు చేయడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే సామర్థ్యాలపై ఐ.సి.డి.ఎస్ అంగన్వాడి సూపర్ వైజర్ శశికళ శిక్షణ ఇచ్చారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం రక్షణ అధికారి జి. క్రాంతిలాల్, మహిళా సంరక్షణ అధికారి జి. రమణి, అంగన్వాడి వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.