ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బ్రిటిష్ పాలనలో 133 ఏళ్ల కిందట నిర్మించబడింది. రెండు అడుగుల వెడల్పు రాతి గోడలు, గానుగ సున్నం, చలువ పెంకులతో నిర్మించిన ఈ భవనం ఎన్నో విపత్తులను తట్టుకొని నిలిచింది. గతంలో అధికారికి ప్రత్యేక వేదిక, చేతితో విసిరే పంకా వ్యవస్థ ఉండేది. రికార్డు గది కూడా పటిష్టంగా ఉంది. ప్రస్తుతం ఈ కార్యాలయం ప్రత్తిపాడు పూర్వపు తాలూకా పరిధిలోని ఏడు మండలాల రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తోంది. సమీపంలోని ఉపఖజానా, పోలీస్ స్టేషన్ భవనాలను పునర్నిర్మించగా, 1980లో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం శిథిలమై వేరే చోటికి మారింది.