ప్రత్తిపాడు మండల న్యాయ సేవాధికార కమిటీకి నలుగురు రిటైనర్ అడ్వకేట్లను నియమిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అందిన అధికారిక ప్రొసీడింగ్స్ ప్రకారం, బుగత శివన్నారాయణ, అడారి సుగుణ, పిల్లి బాలరాముడు, కాపీశెట్టి శ్రీనివాసరావు, ఆకాశపు మల్లేశ్వరరావులను నూతన రిటైనర్ అడ్వకేట్లుగా నియమించారు. ఈ నియామకం ద్వారా మండలంలో న్యాయ సేవలు మరింత విస్తృతం కానున్నాయి.