కాకినాడ జిల్లాలోని అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం జరిగే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ ఈవో సుబ్బారావు భక్తులను కోరారు. మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో, బుధవారం ఉదయం 8:30 గంటలకు స్వామి, అమ్మవార్ల పల్లకి ప్రదక్షిణ, మధ్యాహ్నం 2 గంటలకు సత్యదేవుని రథంపై గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.