అన్నవరం రత్నగిరిపై శ్రీ సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణోత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. నూతన ఈవో సూర్యచక్రధర రావు పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రత్నగిరి గోవింద నామస్మరణతో మారుమోగింది. అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించడంతో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.