సిరిపురంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

814చూసినవారు
సిరిపురంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
ఏలేశ్వరం మండలం సిరిపురంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం డివిజనల్ పంచాయతీ అధికారి ఎం. బాలమణి సూచించారు. మంగళవారం ఎంపీడీవో వర్మతో కలిసి గ్రామాన్ని సందర్శించి, వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి, బ్లీచింగ్ చల్లాలని పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి ప్రతికూల స్పందన రావడంతో సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. మురికినీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి హానికరమని, రోడ్లు, కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్