తూగో జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర
వైసీపీ నాయకురాలు వామిశెట్టి పావని, గోపాలపురం నియోజకవర్గంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సజ్జల రామకృష్ణా రెడ్డికి వివరించారు. దేవరపల్లిలో రేపు జరగబోయే పొగాకు ధర్నాలో ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరనున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా రైతులకు అండగా ఉండాలని
వైసీపీ క్యాడర్‌కు సజ్జల పిలుపునిచ్చారు.