ఎర్రవరం నుంచి ఏలేశ్వరం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో ప్రతిరోజూ ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెట్టు తొలగింపు పనులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.