లింగపర్తిలోని శ్రీ లక్ష్మీ పార్వతి ఫెర్టిలైజర్స్ షాపులో శుక్రవారం విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 8.20 లక్షల విలువైన ఎరువుల నిల్వలలో తేడాలు గుర్తించారు. దీనితో డీలర్‌పై కేసు నమోదు చేశారు. ఈ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.