శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుతుకూరి కాసులమ్మ (55) అనే మహిళ ఆర్టీసీ బస్సు దిగుతున్నప్పుడు జారిపడి, బస్సు చక్రం కాలుపైకి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ దుర్ఘటన జాతీయ రహదారిపై అడ్డరోడ్డు వద్ద జరిగింది. గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.