ఏలేశ్వరం నగర పంచాయతీలో గురువారం
వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీల ప్రతులను దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని
వైసీపీ నేతలు హెచ్చరించారు.