ఏలేరు రిజర్వాయర్ నుంచి సాగు అవసరాల కోసం శుక్రవారం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 84.91 మీటర్ల నీటిమట్టంతో 20.82 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. విశాఖ అవసరాలకు ఎడమ ప్రధాన కాలువ ద్వారా 175 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, ఎగువ ప్రాంతాల నుంచి 256 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.